Wednesday, March 9, 2011

మనుషులు మారాలి

ఇట్లాంటి టైటిల్తో ఏదో పాత సినిమా ఉండాలి. దాన్ని గురించి విషయం. మొన్నటి పోస్టులో రాసిన విషయాన్ని గురించే ఈ ఆలోచన కంటిన్యూ చేస్తున్నా.

కొత్త అలవాటు చేసుకోడం అంటే మార్పే కదా? మార్పు సహజం. మన చుట్టూ ఎన్నో మారుతూ ఉంటాఇ. కాలంతో జరిగే కొన్ని మార్పులు సైక్లికల్ గా జరుగుతూ ఉంటాయ్ కద. పగలు-రాత్రి, సీజన్స్, పండగలు. అట్లా కాకుండా లీనియర్గ జరిగిపోయే మార్పులు కూడా ఉంటాయ్ కద. కాలేజ్లో ఉన్నప్పుడు ఒకలాగ - అప్పటి కోరికలు, అప్పటి ఉత్సాహం, అప్పటి కాంఫిడెన్స్, అప్పటి యవ్వనం ఉద్రెకం .. మిద్ థర్టీ వచ్చెప్పతికి స్చెనె చొంప్లెతె వెరె. పెళ్ళైతుంది. ఒకరో ఇద్దరో పిల్లలు. పేరెంట్స్ ఏగెద్ ఐపొతున్నరు. మనం కూడా ఏదొ ఒక ఇల్లు కొనుక్కొవలి, స్టాక్స్ పెట్టాలి, సెటిల్ అవ్వాలని చూస్తుంటం. ఒక్క 10-15 ఇయర్స్‌లో మన హోప్స్, ఛాలెంజెస్, అన్నీ ఎట్లా మరిపోతయ్ కదా?

సో, ఒక విధంగా చూస్తే, మనకి ఇష్టం ఉన్న లేకున్న మనుషులు మారుతూనె ఉన్నరు. మనం కూడా మారుతున్నాం.

మళ్ళీ ఇది ఇట్లా ఉండంగనే, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదని సామెత. అంటే, కొన్ని కొన్ని బిహేవయర్స్, కొన్ని లక్షణాలు ఎప్పటికీ మారవ్ అని. పైన చెప్పినవి చానమట్టుకి మన కంట్రోల్లో లేకుండ జరిఘే మార్పులు. అంటే వయసు వల్ల కాని, లైఫ్ స్టేటస్ల ఛేంజ్ వల్ల కాని. మన కంట్రోల్లో ఏముండవా. నాలో నాకు నచ్చని గుణాలు ఉన్నై అనుకోండి. వాటిల్ని నేను మార్చుకోలేనా? నాకు బెనిఫిట్ అయ్యెతట్టు?

ఇదే నాకు అర్ధం కాని విషయం. నేనింతే అనుకునుంటే .. అట్లనే ఉంటాను. నేను మారగలను, మారాలి, అలా మారడం నాకు మంచిది అని నిజ్జంగా నమ్మితే మారలేనా?

No comments:

Post a Comment

నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీ వంతు.