Tuesday, March 8, 2011

కొత్త అలవాట్లు

కొత్త అలవాట్లు చేసుకోడం ఎలా?

చెడ్డగానీ మంచిగానీ, కొంత పెద్దైపోయాక కొత్త అలవాట్లని అలవాటు చేసుకోడం చాలా కష్టం.

చిన్నప్పణ్ణించీ అలవాటైన పద్ధతుల్ని తొందరగా వొదులుకోలేము. కొన్ని అలవాట్లు, చెడ్డ అలవాట్లు - అంటే హెల్త్ పాడు చేసేవి, సిగిరెట్లు, మందు, అర్ధరాత్రిళ్ళు దాటి మేలుకుండడం - ఇవన్నీ కొంత వయసొచ్చాకే కదా అలవాటవుతాయి! ఫుడ్డుకి సంబంధించిన చెడ్డ అలవాట్లు ఇంకొంచెం చిన్నవయసులోనే మొదలవుతాయేమో. ఇవి అలవాట్లుగా మారుతున్న టైములో మనం మరీ చిన్నపిల్లలమేం కాదు. ఎందుకవి మరి అంత సులభంగా అలవాటయ్యాయి? చెడ్డవి కాబట్టా? చెడ్డ అలవాట్లని అలవాటు చేసుకోవడం అంటే మనకి ఎట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందా?

జస్ట్ మంచి అలవాట్లని పెంచుకోవాలి అంటేనే రెసిస్టెన్స్ వస్తుందా?
ఇప్పటికి వారం రోజుల్నించీ ట్రై చేస్తున్నా రోజూ సాయంత్రం ఎక్సర్సైజు చెయ్యాలని. బిజీ లైఫ్ ఎప్పుడూ ఉండేదే, కానీ ఒక్క అరగంట స్పేర్ చెయ్యలేనంత బిజీ కాదు. ఐనా ఆ టైం వచ్చేటప్పటికి, ఏంటో రెసిస్టెన్స్. ఎక్సర్సైజ్ చెయ్యకుండ ఉండటానికి కారణాలు వెతుక్కోడం, ఏదో ఒక వంక పెట్టుకోవడం, మానెయ్యడం. నెక్స్ట్ డే మళ్ళీ పొద్దుటే లాభం లేదు ఇవ్వాళ్ళ తప్పకుండా ఎక్సర్సైజ్ చెయ్యాలి అని రిజొల్యూషన్!

అసలుకి ఏదన్నా ఒక పని అలవాటుగా మారాలి అంటే ఎన్నాళ్ళు కంటిన్యూగా చెయ్యాలి అంటారూ?

ఎక్సర్సైజ్ చెయ్డం కూడా మందుకొట్టడం అంత యీజీగా అలవాటైతే బాగుణ్ణు కదా.

4 comments:

  1. ఫాంట్ సైజు పెంచితే బాగుండునేమో.మరీ చిన్నగా ఉన్నాయి :)

    ReplyDelete
  2. ఫాంట్ సైజ్ పెంచండి బాబో....చీమ తలకాయలంత ఉన్నాయి.చదవలేక పోతున్నా...అవి కూడా ఎక్సర్ సైజ్ చేసాయా ఏమిటి మరీ అంత సన్నగా ఉన్నాయి..:))

    ReplyDelete
  3. ఇప్పుడు మార్చానండి.

    ReplyDelete

నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీ వంతు.