Wednesday, March 9, 2011

మనుషులు మారాలి

ఇట్లాంటి టైటిల్తో ఏదో పాత సినిమా ఉండాలి. దాన్ని గురించి విషయం. మొన్నటి పోస్టులో రాసిన విషయాన్ని గురించే ఈ ఆలోచన కంటిన్యూ చేస్తున్నా.

కొత్త అలవాటు చేసుకోడం అంటే మార్పే కదా? మార్పు సహజం. మన చుట్టూ ఎన్నో మారుతూ ఉంటాఇ. కాలంతో జరిగే కొన్ని మార్పులు సైక్లికల్ గా జరుగుతూ ఉంటాయ్ కద. పగలు-రాత్రి, సీజన్స్, పండగలు. అట్లా కాకుండా లీనియర్గ జరిగిపోయే మార్పులు కూడా ఉంటాయ్ కద. కాలేజ్లో ఉన్నప్పుడు ఒకలాగ - అప్పటి కోరికలు, అప్పటి ఉత్సాహం, అప్పటి కాంఫిడెన్స్, అప్పటి యవ్వనం ఉద్రెకం .. మిద్ థర్టీ వచ్చెప్పతికి స్చెనె చొంప్లెతె వెరె. పెళ్ళైతుంది. ఒకరో ఇద్దరో పిల్లలు. పేరెంట్స్ ఏగెద్ ఐపొతున్నరు. మనం కూడా ఏదొ ఒక ఇల్లు కొనుక్కొవలి, స్టాక్స్ పెట్టాలి, సెటిల్ అవ్వాలని చూస్తుంటం. ఒక్క 10-15 ఇయర్స్‌లో మన హోప్స్, ఛాలెంజెస్, అన్నీ ఎట్లా మరిపోతయ్ కదా?

సో, ఒక విధంగా చూస్తే, మనకి ఇష్టం ఉన్న లేకున్న మనుషులు మారుతూనె ఉన్నరు. మనం కూడా మారుతున్నాం.

మళ్ళీ ఇది ఇట్లా ఉండంగనే, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదని సామెత. అంటే, కొన్ని కొన్ని బిహేవయర్స్, కొన్ని లక్షణాలు ఎప్పటికీ మారవ్ అని. పైన చెప్పినవి చానమట్టుకి మన కంట్రోల్లో లేకుండ జరిఘే మార్పులు. అంటే వయసు వల్ల కాని, లైఫ్ స్టేటస్ల ఛేంజ్ వల్ల కాని. మన కంట్రోల్లో ఏముండవా. నాలో నాకు నచ్చని గుణాలు ఉన్నై అనుకోండి. వాటిల్ని నేను మార్చుకోలేనా? నాకు బెనిఫిట్ అయ్యెతట్టు?

ఇదే నాకు అర్ధం కాని విషయం. నేనింతే అనుకునుంటే .. అట్లనే ఉంటాను. నేను మారగలను, మారాలి, అలా మారడం నాకు మంచిది అని నిజ్జంగా నమ్మితే మారలేనా?

Tuesday, March 8, 2011

కొత్త అలవాట్లు

కొత్త అలవాట్లు చేసుకోడం ఎలా?

చెడ్డగానీ మంచిగానీ, కొంత పెద్దైపోయాక కొత్త అలవాట్లని అలవాటు చేసుకోడం చాలా కష్టం.

చిన్నప్పణ్ణించీ అలవాటైన పద్ధతుల్ని తొందరగా వొదులుకోలేము. కొన్ని అలవాట్లు, చెడ్డ అలవాట్లు - అంటే హెల్త్ పాడు చేసేవి, సిగిరెట్లు, మందు, అర్ధరాత్రిళ్ళు దాటి మేలుకుండడం - ఇవన్నీ కొంత వయసొచ్చాకే కదా అలవాటవుతాయి! ఫుడ్డుకి సంబంధించిన చెడ్డ అలవాట్లు ఇంకొంచెం చిన్నవయసులోనే మొదలవుతాయేమో. ఇవి అలవాట్లుగా మారుతున్న టైములో మనం మరీ చిన్నపిల్లలమేం కాదు. ఎందుకవి మరి అంత సులభంగా అలవాటయ్యాయి? చెడ్డవి కాబట్టా? చెడ్డ అలవాట్లని అలవాటు చేసుకోవడం అంటే మనకి ఎట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందా?

జస్ట్ మంచి అలవాట్లని పెంచుకోవాలి అంటేనే రెసిస్టెన్స్ వస్తుందా?
ఇప్పటికి వారం రోజుల్నించీ ట్రై చేస్తున్నా రోజూ సాయంత్రం ఎక్సర్సైజు చెయ్యాలని. బిజీ లైఫ్ ఎప్పుడూ ఉండేదే, కానీ ఒక్క అరగంట స్పేర్ చెయ్యలేనంత బిజీ కాదు. ఐనా ఆ టైం వచ్చేటప్పటికి, ఏంటో రెసిస్టెన్స్. ఎక్సర్సైజ్ చెయ్యకుండ ఉండటానికి కారణాలు వెతుక్కోడం, ఏదో ఒక వంక పెట్టుకోవడం, మానెయ్యడం. నెక్స్ట్ డే మళ్ళీ పొద్దుటే లాభం లేదు ఇవ్వాళ్ళ తప్పకుండా ఎక్సర్సైజ్ చెయ్యాలి అని రిజొల్యూషన్!

అసలుకి ఏదన్నా ఒక పని అలవాటుగా మారాలి అంటే ఎన్నాళ్ళు కంటిన్యూగా చెయ్యాలి అంటారూ?

ఎక్సర్సైజ్ చెయ్డం కూడా మందుకొట్టడం అంత యీజీగా అలవాటైతే బాగుణ్ణు కదా.

Friday, March 4, 2011

మగాళ్ళు వట్టి మాయగాళ్ళె

ఈ పాట రాసింది ఒక మగాడేనా?

అసలు మగాళ్ళని మగాళ్ళే ఎందుకిలాగ అసయ్యం పుట్టేలా రాస్తారో? మనోళ్ళు అన్నీ ఇంతే. దేశీల్ని దేశీలే ఈసడిస్తారు. తెలుగోళ్ళని తెలుగోళ్ళే దిగజారుస్తారు. మొగోళ్ళని మొగోళ్ళే .. సినిమాలే అమ్మాయే పాడుద్దనుకోండి, కానీ పాట అసలుకి రాసింది మగాడే కదా. మగాడికి ప్రేమంటే తెలీదా?

అసలుకి నన్నడిగితే ఆడోళ్ళకే ప్రేమంటే తెలీదు. ఆడోల్లు ఈ విషయంలో తెలివిగా ఉంటారు. మొగోళ్ళే వెర్రుబాబుల్లాగా దిల్లిచ్చేసి బిల్లులు కట్టుకుంటూ వొళ్ళు గుల్లచేస్కుంటారు.

Wednesday, February 16, 2011

హృతిక్ రోషన్ కైట్స్ సినిమా చూశారా ఎవరన్నా?

చూశారా? మీరు చూసారా?

మెక్సికన్ అమ్మాయితో రొమాన్సింగులంట
లాస్ వేగాస్ లో చేజింగులంట
హాట్ హాట్ అంత!

Friday, May 14, 2010

తెలుగు పేర్లు English Media

ఇవ్వాల్ల morning న్యూస్ చూద్దామని ఒక English AP సైట్లోకి వెల్లా.

ఈ heading కనబడింది.

"Gone develops sudden love for T-martyrs"

ఏంట్రా దీనికి అర్దం అని కసెపు తల బద్దలు కొత్తుకున్నా. ఆ లింక్ తెరిస్తె .. ఎవరొ గోనె ప్రభాకర్రావ్ అంట, కాంగ్రస్ నించి మారి ఇప్పుడు తెలంగాణకి జై కొడతన్నాడంట.

అతని పేరుని english లొ Gone అని రాస్తే .. Gone with the Wind లెవెల్లో ఈ Gone ఎంటో అర్దం కాదు!

Wednesday, May 12, 2010

కిరికెట్

ఇండియన్ బాట్స్మెన్ ఎక్కడ తమ ప్రతాపం బాగా చూపిస్తారు?
ఎడ్వర్టైజ్మెంట్లలో!

ఇండియన్ బాట్స్మెన్‌కీ టీబేగ్‌కీ తేడా ఏంటి?
టీబేగ్ టీకప్పులో ఇంకా ఎక్కువసేపుంటుంది, మనోడు క్రీజ్ దగ్గర ఉన్నదానికంటే!

శరద్ పవార్: ఏంట్రా ధోని, T20 లో 12 టీములుంటే అందరికంటే అధమాధమంగా వచ్చారా?
ధోని: అదికాదన్నా, ఇంకా దారుణం జరిగుండొచ్చుగా?
శరద్ పవార్: ఇంకా దారుణమా? ఎలాగ?
ధోని: 12 కంటే ఇంకా ఎక్కువ టీములుండి ఉండొచ్చుగా!

Tuesday, May 11, 2010

బ్రిటిష్ గవరనమెంటు

బ్రిటన్ని గురించి ఒక జోకుంది .. ఎవడో బ్రిటను వెళ్ళి వస్థే వాల్ల ఫ్రెందు అడిగాడంట. బ్రిటిష్ హాస్పిటాలిటీనీ బ్రిటిష్ క్యుసీన్ (అంటే భోజనం) నీ ఎంజాయ్ చేశావా అని.
They are non-existant అని అన్సర్ చెప్పాడంట మనోడు.

అట్లనే .. ఇంకోటుంది non-existant.

That is British Government!

ha ha ha